‘దర్శనాలు లేకపోయినా రూ.1.98 కోట్ల ఆదాయం’ | Tirumala Laddu Will Be Available At TTD Centers | Sakshi
Sakshi News home page

టీటీడీ: దర్శనాలు లేకపోయినా రూ.1.98 కోట్ల ఆదాయం

May 20 2020 3:11 PM | Updated on May 20 2020 3:18 PM

Tirumala Laddu Will Be Available At TTD Centers - Sakshi

సాక్షి, తిరుపతి : లాక్‌డౌన్‌ కారణంగా తిరుమల తిరుపతి దేవస్థాన దర్శనం రద్దు చేసి రెండు నెలలైందని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరిగి తిరుమల దర్శనం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. టీటీడీ చైర్మన్‌ బుధవారం మాట్లాడుతూ.. భక్తులు శ్రీవారి దర్శనం కల్పించాలని కోరుతున్నారన్నారు. కనీసం స్వామి వారి ప్రసాదలైన అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. రూ. 50కు అందించే లడ్డును రూ.25కే అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. (నాతో పాటు తల్లి, భార్య మాత్రమే వచ్చారు: వైవీ సుబ్బారెడ్డి)

టీటీడీ కేంద్రాలలో లడ్డు అందుబాటులో ఉంచుతామని, మరో రెండు రోజుల్లో అమలు చేస్తామని టీటీడీ చైర్మన్‌ అన్నారు. అన్ని జిల్లాలో టీటీడీ కళ్యాణ మండపాలలో అందుబాటులో ఉంచుతామని, లడ్డులు, ప్రసాదాలు కావాలని కోరితే వారికి అందిస్తామన్నారు. ఇందుకు ఆలయ అధికారిని సంప్రదించాలని సూచించారు. టీటీడీలో ఆర్థిక ఇబ్బందులు లేవని, ఎవరూ అపోహలు నమ్మొద్దన్నారు. దేవస్థానం వద్ద అవసరమైన నిధులు పూర్తిగా ఉన్నాయన్నారు. ఈ సంవత్సరం దర్శనాలు లేకపోయినా ఆదాయం రూ.1.98 కోట్లు వచ్చిందని, ఈ-హుండీ ఆదాయం రూ.1.79 కోట్లు వచ్చిందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. (కరోనా: భారీగా ఉద్యోగాల కోత )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement