రైలు ఢీకొని ముగ్గురూ దుర్మరణం చెందారు | Three killed in train cras | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని ముగ్గురూ దుర్మరణం చెందారు

Nov 18 2013 2:37 AM | Updated on Aug 28 2018 7:14 PM

అసలే కార్తీక మాసం. ఎక్కడ చూసినా పిక్నిక్ ల సందడి. పిల్లల్ని పిక్నిక్‌కి తీసుకెళ్తే చాలా సంతోషిస్తారని భావించిన ఆ తండ్రి భార్యాపిల్లలను

 విజయనగరం క్రైం, నెల్లిమర్ల రూరల్: అసలే కార్తీక మాసం. ఎక్కడ చూసినా పిక్నిక్ ల సందడి. పిల్లల్ని పిక్నిక్‌కి తీసుకెళ్తే చాలా సంతోషిస్తారని భావించిన ఆ తండ్రి భార్యాపిల్లలను పిక్నిక్‌కి తీసుకువెళ్లాడు. అయితే ఆ సంతోషం వారికి తిరిగి ఇంటికెళ్లిం దాకా కూడా మిగల్లేదు. రైలు రూపంలో ఆ తండ్రీకొడుకులను మృత్యువు కాటేసింది. నెల్లిమర్లలో ఆదివారం పాసిం జర్ రైలు ఢీకొట్టడంతో పిక్నిక్‌కు వెళ్లి వస్తున్న తండ్రీ కొడుకులు దుర్మర ణం చెందారు. స్థానికులు, రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. విజయనగరం పట్టణంలోని కొత్తఅగ్రహారంలో బాలాజీసింగ్ (40) కుటుంబసభ్యులు నివాసం ఉంటున్నారు. బాలాజీసింగ్ కు భార్య అనుపమ, కుమారులు పురుషోత్తం (8), అనిష్(4) ఉన్నారు.
 
 బాలాజీసింగ్ హెచ్‌డీఎఫ్‌సీ అనుబంధ సంస్థ ఆల్‌మార్క్‌ఫైనాన్స్‌లో కలెక్షన్ అఫీసర్. ఆయన భార్యాపిల్లలతో కలిసి నెల్లిమర్ల చంపావతి నది వద్దకు పిక్నిక్‌కు వెళ్లారు. పిక్నిక్ అంతా పిల్లలతో సరదాగా గడిపారు. తిరుగు ప్రయాణంలో నెల్లిమర్ల ఫ్లై ఓవర్ వద్దకు వచ్చేసరికి పెద్దకుమారుడు పురుషోత్తం(8) బహిర్భూమికి వెళ్తానన్నాడు. బాలాజీసింగ్  ద్విచక్రవాహనాన్ని భార్య అనుపమను రోడ్డుమీద ఉంచి ఇద్దరు కుమారులను రైల్వే ట్రాక్ సమీపంలోకి తీసుకువెళ్లాడు. ట్రాక్ పక్కనే గెడ్డ ఉంది.  పురుషోత్తం, అనిష్‌లను  రెండు పట్టాల మధ్య ఖాళీ ప్రదేశంలో కుర్చోబెట్టాడు. పని పూర్తయ్యాక తిరిగి ముగ్గురూ పట్టాలు దాటుతున్నారు. ఉదయం పదిన్నర సమయంలో నెల్లిమర్ల నుం చి విజయనగరం వైపు గూడ్స్ రైలు వస్తోంది. ఇది గమనించిన బాలాజీసింగ్ వెంటనే ఇద్దరు కుమారులతో రెండో వైపు ఉన్న పట్టాలమీదకు వచ్చారు. అయితే అదే సమయంలో విజయనగరం నుంచి నెల్లిమర్ల వైపు పాసింజర్ రైలువస్తోంది.
 
 ఆ రైలును వీరు గమనించక పోవడంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు ముగ్గురూ అక్కడిక్కడే దుర్మరణం చెందారు. సమీపంలో ఉన్న భార్య అనుపమ సంఘటన చూసి భోరున విలపించడంతో స్థానికులు వచ్చి చూసేసరికి ముగ్గురూ మృతి చెంది ఉన్నారు. మృతదేహాలను విజయనగరం, ఆమదాలవల స రైల్వే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. పురుషోత్తం విజయనగరంలోని శారదా విద్యాని కేతన్‌లో చదువుతున్నాడు చిన్న కుమారుడు అనిష్‌ను ఇంకా స్కూలులో చేర్చలేదు. ఇంటి వద్దనే ఉంటాడు. మృతుడు బాలా జీ సింగ్‌కు తల్లిదండ్రులు సరస్వతి బాయి,నారాయణ స్వామి, తమ్ముడు చంటి, అక్క మంగబాయి, చెల్లి భాగ్యలక్ష్మి ఉన్నారు.  
 
 నన్నెందుకు బతికించావు
 తన కళ్లముందే భర్త బాలాజీసింగ్, కుమారులు పురుషోత్తం, అనిష్ రైలు ప్రమాదంలో మృత్యువాత పడడాన్ని భార్య అనుప మ జీర్ణించుకోలేకపోతోంది. భర్త, పిల్లలు మృతిచెందాక దేవుడా నన్నెందుకు  బతికించావంటూ  భోరున విలపిస్తోంది. పురుషోత్తం బహిర్భూమికి వెళ్తానని చెప్పగానే ఇంటికి వెళ్లిపోదామని తాను చెబితే..పురుషోత్తం ఇబ్బంది పడతాడని చెప్పి భర్త బాలా జీసింగ్ తీసుకువెళ్లాడని.. అలా మృత్యువు ఒడిలోకి చేరిపోయారని రోదిస్తోంది.
 
 మాతో చెప్పకుండా వెళ్లాడు..
 ఎక్కడికి వెళ్లినా తమతో చెప్పే బాలాజీసింగ్ చెప్పకుండా వనభోజనాలకు వెళ్లాడని తల్లిదండ్రులు రోదిస్తున్నారు. ఇంత మంచి కొడుకును తాము  ఎప్పుడూ, ఎక్కడా చూడలేదంటూ భోరున విలపిస్తున్నారు. మాకు తెలిస్తే పంపేవాళ్లం కాదని,  ఇక తమకెవరు దిక్కని వారు రోదిస్తుంటే చూపరులు కంటతడి పెట్టారు. కుమారుడు లేకపోతే ఇంకా తాము ఎందుకు బతకాలంటూ వారు విలపిస్తున్నారు.  
 
 అండగా ఉండేవాడు
 తమకు ఏ కష్టమొచ్చినా సోదరుడు బాలాజీసింగ్ అండగా ఉండేవాడని అక్కాచెల్లెళ్లు విలపిస్తున్నారు. బాలాజీసింగ్ రైలు ప్రమాదంలో మృతిచెందాడన్న విషయాన్ని నమ్మలేకపోయాన ని చిన్న బావ రామారావు రోదించాడు. తన భార్య భాగ్యలక్ష్మి,బావమరిది చంటిని రైల్వేలో గ్రూపు డీ పరీక్షను విశాఖపట్నం లో రాయడానికి తీసుకువెళ్లానని ఇంతలోనే ఇది జరిగిందని తెలిసి నమ్మలేకపోయానని భోరున విలపించాడు.
 
 కొత్తఅగ్రహారంలో విషాద ఛాయలు..
 రైలు ప్రమాదంలో మృతిచెందిన బాలాజీసింగ్ నివాసం ఉంటు న్న కొత్తఅగ్రహారంలో విషాదఛాయలు అలముకున్నాయి.  బాలాజీసింగ్‌కు పిల్లలంటే చాలా ఇష్టమని.. ఏ చిన్నపిల్లవాడు  కనిపించినా ఎత్తుకుని ముద్డాడే వాడని స్థానికులు అంటున్నారు. అందరితో మంచిగా ఉండే బాలాజీసింగ్ మృత్యువాత పడడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement