వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, పన్ను రాయితీలపై ప్రస్తావిస్తామని ఎంపీ తోట నర్సింహులు స్పష్టం చేశారు.
హైదరాబాద్:వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, పన్ను రాయితీలపై ప్రస్తావిస్తామని ఎంపీ తోట నర్సింహులు స్పష్టం చేశారు. త్వరలో ప్రారంభం కానున్న సమావేశాల్లో విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని కోరతామన్నారు. రాష్ట్రానికి రావాల్సిన రైల్వే ప్రాజెక్ట్ ల గురించి రైల్వే మంత్రిని కోరతామని.. బుల్లెట్ ట్రైన్ అంశాన్ని కూడా పార్లమెంట్ లో ప్రస్తావిస్తామన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన 12 బిల్లులకు మద్దతివ్వాలని నిర్ణయించామన్నారు.
14 ఆర్థిక సంఘం ద్వారి రూ.9 వేల కోట్లు ఇవ్వాలని కోరతామని ఎంపీ తోట నర్సింహులు తెలిపారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీకి సమస్యలపై మాట్లాడే హక్కులేదని.. చట్టప్రకారం రావాల్సిన హక్కులన్నీ బీజేపీతో కలిసి సాధిస్తామన్నారు.