గెలుపే లక్ష్యంగా ప్రచారం | The YSRCP campaign aims to win | Sakshi
Sakshi News home page

గెలుపే లక్ష్యంగా ప్రచారం

Jan 17 2016 1:24 PM | Updated on Sep 3 2017 3:48 PM

ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యంగా పార్టీ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి ఆదివారం ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు.

ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యంగా పార్టీ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి ఆదివారం ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన వెంట ఎంపీ వైవీ సుబ్బారెడ్డితోపాటు పార్టీ ఎమ్మెల్యేలు అశోక్‌రెడ్డి, పాలపర్తి డేవిడ్‌రాజు, పోతుల రామారావు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఉన్నారు.


 ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆర్టీసీ కార్మికులకు చేసిన మేలు గురించి వివరించడం ద్వారా ఎక్కువ మంది కార్మికులను పార్టీలోకి వచ్చేలా కృషి చేసే దిశగా ఆయన పర్యటన కొనసాగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement