ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ కుర్చీ తనదంటే తనదంటూ ఇద్దరు నాయకులు గొడవపడ్డారు.
హైదరాబాద్: ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ కుర్చీ తనదంటే తనదంటూ ఇద్దరు నాయకులు గొడవపడ్డారు. హైకోర్డు ఉత్తర్వుల మేరకు జెడ్పీ చైర్మన్ గా ఈదర హరిబాబు బాధ్యతలు చేపట్టారు. అయితే అధికారులు లేకుండానే ఆయన బాధ్యతలు చేపట్టారు.
జెడ్పీ ఛైర్మన్ ఈదర కాదని, తానేనంటూ నూకసాని బాలాజీ వివాదానికి దిగారు. ఈదరకు అనుకూలంగా వచ్చిన హైకోర్డు ఉత్తర్వులు తమకు ఇంకా అందలేదని కలెక్టర్ విజయ్‌కుమార్ చెబుతున్నారు.