త్వరలో టీయూడబ్ల్యూజే: దేవులపల్లి అమర్ | Telangana Working Journalists Association to form soon, says Amar | Sakshi
Sakshi News home page

త్వరలో టీయూడబ్ల్యూజే: దేవులపల్లి అమర్

Dec 25 2013 3:45 AM | Updated on Sep 2 2017 1:55 AM

రాష్ట్ర విభజన జరగనున్న తరుణంలో త్వరలోనే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ఆవిర్భవించనున్నట్లు ఐజేయూ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్ తెలిపారు.

కరీంనగర్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన జరగనున్న తరుణంలో త్వరలోనే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ఆవిర్భవించనున్నట్లు ఐజేయూ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్ తెలిపారు. ఈనెల 28న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏపీయూడబ్ల్యూజే కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల ప్రాంతీయ సదస్సు కరీంనగర్‌లో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా అమర్ మాట్లాడుతూ..యాజమాన్యాలు ఎవరైనా.. తవు వృత్తిధర్మంలో ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించామని చెప్పారు. 60 ఏళ్ల చరిత్ర కలిగిన ఏపీయూడబ్ల్యూజేను తెలంగాణ జర్నలిస్టుల ఫోరం చీల్చే ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. టీజేఎఫ్ యూనియన్‌గా ఏర్పడితే అభ్యంతరంలేదన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement