టీడీపీకి షాక్‌ | Tdp In Shock | Sakshi
Sakshi News home page

టీడీపీకి షాక్‌

Mar 28 2019 10:29 AM | Updated on Mar 28 2019 10:30 AM

Tdp In Shock - Sakshi

పార్టీలో చేరుతున్న పొనుగుటివలస గ్రామానికి చెందిన గార గున్నంనాయుడితో అనుచరవర్గం

సాక్షి, రాజాం: నియోజకవర్గంలో టీడీపీకి షాక్‌ మీద షాక్‌ తగులుతోంది. రాజాం నగర పంచాయతీకి సంబంధించి టీడీపీకి కంచుకోట గ్రామమైన పొనుగుటివలస వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలోకి చేరింది. ఈ గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్‌ నేత గార గున్నంనాయుడు అనుచర వర్గంతోపాటు అనేక కుటుంబాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరాయి. బుధవారం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు గార గున్నంనాయుడు, జల్ల రాములు, శాసపు శ్రీనివాసరావు, శాసపు రమణ, జల్ల త్రినాధరావు, గార చంటిబాబు, ఆబోతులు విశ్వనాధం, వావిలపల్లి వెంకటినాయుడు, వావిలపల్లి రామకృష్ణ, ఉత్తరావల్లి రాము, జల్ల సన్యాశినాయుడు, శాసపు అప్పలనాయుడు, జల్ల తమ్మినాయుడు, ఉత్తరావల్లి నర్శింహులు, జల్ల గణపతి, గిరడ లింగడు, జల్ల శ్రీను, జల్ల సత్యన్నారాయణ, జల్ల సూర్యనారాయణ, జల్ల లకు‡్ష్మంనాయుడు, ఆబోతులు రాంబాబు తదితరులతోపాటు మరికొంతమంది పార్టీలోకి చేరారు. వీరికి పార్టీ కండువా వేసి రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్, రాజాం టౌన్‌ కన్వీనర్‌ పాలవలస శ్రీనివాసరావు, రెడ్డి అప్పలనాయుడు, కార్యదర్శి శాసపు వేణుగోపాలనాయుడు తదితరులు పార్టీలోకి ఆహ్వానించారు. 


గాంధీ వీధి నుంచి..
రాజాం నగర పంచాయతీ పరిదిలోని గాంధీవీధీ, శెగిడి వీధికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. కొనపల కూర్మారావు, తోట నారాయణరావు, కొత్తలంక రాంబాబు, ఎ. షన్ముఖరావు, కర్రి రాంబాబు, మాధవీలత, సరోజిని, లక్ష్మి, పవన్, దాసరి శ్రీను, ముత్యం, సుధీర్‌ తదితరులు పార్టీలో చేరారు. వీరికి పార్టీ రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులుతోపాటు పార్టీ రాజాం టౌన్‌ కన్వీనర్‌ పాలవలస శ్రీనివాసరావు, యూత్‌ కన్వీనర్‌ వంజరాపు విజయ్‌కుమార్, అధికార ప్రతినిధి ఆసపు సూర్యం, గొర్లె బద్రర్స్‌లు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement