మంత్రి అవినీతిపై టీడీపీ శ్రేణుల మల్లగుల్లాలు..! | TDP leaders worried about sakshi story against achhennayudu | Sakshi
Sakshi News home page

మంత్రి అవినీతిపై టీడీపీ శ్రేణుల మల్లగుల్లాలు..!

Jul 7 2015 12:19 PM | Updated on Aug 29 2018 7:50 PM

మంత్రి అవినీతిపై టీడీపీ శ్రేణుల మల్లగుల్లాలు..! - Sakshi

మంత్రి అవినీతిపై టీడీపీ శ్రేణుల మల్లగుల్లాలు..!

ఆంధ్రప్రదేశ్ కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడుపై 'సాక్షి' మీడియాలో కథనం రావడంతో టీడీపీలో గుబులు మొదలైంది.

శ్రీకాకుళం : 13వ ఆర్థిక సంఘం నిధులు కాజేశారంటూ మంత్రి అచ్చెన్నాయుడుపై సాక్షి టీవీలో వెలువడిన కథనంపై టీడీపీ శ్రేణులు మల్లగుల్లాలు పడుతున్నారు. కురుడు పంచాయతీ ట్రెజరీ అకౌంట్‌ నుంచి డ్రా చేసిన 15లక్షల నిధులకు సరిపడా పనులు చేసినట్లు రికార్డులు సృష్టించాలని ఇంజనీరింగ్‌ అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించిట్లు తెలుస్తోంది.

ఈ మేరకు అధికారులు కూడా రికార్డులు సృష్టించే పనిలో పడ్డారు. మరోవైపు నిధులు డ్రా చేయడానికి సహకరించిన ఎంపీడీవోను ఈ కేసు నుంచి తప్పించేందుకు మంత్రి ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ స్కామ్‌లో తన పేరు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తన పేరు బటయపట్టవద్దని మంత్రి అధికారులందరికీ ముందుస్తు హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు సమాచారం. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement