ఉప ఎన్నికల సందర్భంగా నంద్యాలలో రాజకీయాలు రోజు రోజుకు వెడెక్కుతున్నాయి.
నంద్యాల: ఉప ఎన్నికల సందర్భంగా నంద్యాలలో రాజకీయాలు రోజు రోజుకు వెడెక్కుతున్నాయి. అధికార పార్టీ ఎలాగైనా విజయం సాధించేందుకు ఓటర్లను విభిన్న రీతుల్లో ఆకట్టుకునేందుకు రోజుకో ప్రయత్నాం చేస్తోంది. 42వ వార్డులో మహిళ ఓటర్లకు కుట్టుమిషన్ల పంచేందుకు టీడీపీ రంగం సిద్ధం చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా 10 కుట్టు మిషన్లు తీసుకొచ్చి 200 మంది మహిళలను టీడీపీ నేతలు పిలిచారు. తెచ్చిన పది కుట్టు మిషన్లు ఎవరికిస్తారంటూ మహిళలు నేతలను నిలదీశారు. దీనికి టీడీపీ నేతలు పొంతన లేని సమాధనాలు చెప్పి తప్పించుకున్న టీడీపీ నేతలు.
వైఎస్ఆర్సీపీ నేతలు అడ్డుకోవడం వల్లే అందరికీ ఇవ్వలేక పోతున్నామని టీడీపీ కట్టు కథలు చెబుతుంది. ఈ విషయంలో టీడీపీ నేతలపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్టుమిషన్ల కథ అడ్డం తిరగడంతో టీడీపీ నేతలు నిరాశ చెందారు. ఆగస్టు 23వ తేదిన నంద్యాల ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాగంగానే టీడీపీ ప్రభుత్వం నంద్యాలపై వరాలు కురిపిస్తుంది.