తానేటి వనిత దీక్ష భగ్నం | Taneti Vanita Hunger Strike Foil | Sakshi
Sakshi News home page

తానేటి వనిత దీక్ష భగ్నం

Aug 28 2013 12:00 PM | Updated on Sep 1 2017 10:12 PM

తానేటి వనిత దీక్ష భగ్నం

తానేటి వనిత దీక్ష భగ్నం

మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేశారు.

వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. గత నాలుగు రోజుల దీక్ష చేస్తుండడంతో ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. బీపీ, షుగర్ లెవల్ బాగా తగ్గడంతో ఆమె నీరసించిపోయారు.

అయితే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష పూర్తయ్యే వరకు  దీక్ష కొనసాగిస్తానని తానేటి వనిత స్పష్టం చేశారు.  మరోవైపు వనిత ఆరోగ్య పరిస్థితిపై ఆమె తండ్రి మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు, సోదరుడు విజయ్మోహన్ కుమార్ ఆందోళన చెందారు. ఆమె ఆరోగ్యం బాగా క్షీణించడంతో వనిత దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement