అరకోటి స్వాహా | Swaha half a million | Sakshi
Sakshi News home page

అరకోటి స్వాహా

Nov 14 2014 2:09 AM | Updated on Sep 2 2017 4:24 PM

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ఫైనాన్స్ విభాగం అధికారులు తమ చేతివాటం ప్రదర్శించారు.

ఎస్కేయూలో అధికారుల మాయాజాలం  
బినామీ పేర్లతో బొక్కేసిన వైనం

 
 యూనివర్సిటీ :  శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ఫైనాన్స్ విభాగం అధికారులు తమ చేతివాటం ప్రదర్శించారు. బినామీ పేర్లతో ఖాతాలు సృష్టించి రూ.50 లక్షల వరకు స్వాహా చేశారు. గురువారం బ్యాంక్ అధికారుల సమాచారంతో రిజిస్ట్రార్ ఆచార్య కె.దశరథరామయ్య హుటాహుటిన ఫైనాన్స్ కార్యాలయాన్ని సీజ్ చేసి రికార్డులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఎస్కేయూ ఇన్‌చార్జ్ వీసీ ఆచార్య కే.లాల్‌కిశోర్‌కు సమాచారం అందించారు. 2006 నుంచి వర్సిటీలో విధులు నిర్వహించే ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల అరియర్స్ నుంచి ఆదాయపు పన్నును మినహాయించి వారి జీతం నుంచి తగ్గించిన మొత్తాలను నేరుగా బినామీ ఖాతాలకు మళ్లించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోధనా సిబ్బంది ప్రొఫెషనల్ ట్యాక్స్, పీహెచ్‌డీ ఇంక్రిమెంట్లు చెల్లింపులను అక్రమంగా తమ ఖాతాలకు మళ్లించినట్లు తెలుస్తోంది.

తాజాగా ఈనెల 7న బోధనా సిబ్బందికి అరియర్స్‌ను రూ.కోటి 88 లక్షలను చెల్లించారు. ఈ చెల్లింపుల్లోనే రూ.15 లక్షలు స్వాహా చేశారని ఓ అధికారి వెల్లడించారు. ఒక్కో విభాగంలో ఏళ్ల తరబడి పాతుకుపోవడం వల్లనే అక్రమాలకు తెర తీస్తున్నట్లు సమాచారం. కాగా, వర్సిటీలోని ఫైనాన్స్ అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా తేలిందని  రిజిస్ట్రార్ దశరథరామయ్య ధ్రువీకరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement