ఎస్ కేయూలో అవినీతి బాగోతం | financial officials corruption in sk university | Sakshi
Sakshi News home page

ఎస్ కేయూలో అవినీతి బాగోతం

Nov 14 2014 9:53 AM | Updated on Sep 2 2017 4:28 PM

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో అవినీతి బాగోతం బయటబడింది.

అనంతపురం:శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో అవినీతి బాగోతం బయటబడింది. ఫైనాన్స్ విభాగం అధికారులు తమ చేతివాటం ప్రదర్శించి రూ. కోటి మళ్లించారు. యూనివర్శిటీలోని అకౌంట్స్ ఉద్యోగులు ఉదయ భాస్కర్, శేషయ్యలు ఈ అవినీతికి పాల్పడ్డారు. వీరిని  యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఆచార్య దశరథరామయ్య సస్పండ్ చేస్తూ ఉత్తర్వలు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు ప్రొఫెసర్లతో కూడిన త్రిసభ్య కమిటీని నియమించారు. 2006 నుంచి వర్సిటీలో విధులు నిర్వహించే ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల అరియర్స్ నుంచి ఆదాయపు పన్నును మినహాయించి వారి జీతం నుంచి తగ్గించిన మొత్తాలను నేరుగా బినామీ ఖాతాలకు మళ్లించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

బోధనా సిబ్బంది ప్రొఫెషనల్ ట్యాక్స్, పీహెచ్‌డీ ఇంక్రిమెంట్లు చెల్లింపులను అక్రమంగా తమ ఖాతాలకు మళ్లించినట్లు తెలుస్తోంది. వర్సిటీలోని ఫైనాన్స్ అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా తేలిందని  రిజిస్ట్రార్ దశరథరామయ్య ధ్రువీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement