పెద్దేముల్‌లో సబ్‌కలెక్టర్ పర్యటన | sub collector tour in peddamul | Sakshi
Sakshi News home page

పెద్దేముల్‌లో సబ్‌కలెక్టర్ పర్యటన

Jan 22 2014 1:28 AM | Updated on Mar 28 2018 10:59 AM

పెద్దేముల్‌లో బాలిక మెడలో వృద్ధుడు తాళి కట్టాడని వచ్చిన వార్తలపై మంగళవారం వికారాబాద్ సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి బహిరంగ విచారణ చేపట్టారు.

 పెద్దేముల్, న్యూస్‌లైన్: పెద్దేముల్‌లో బాలిక మెడలో వృద్ధుడు తాళి కట్టాడని వచ్చిన వార్తలపై మంగళవారం వికారాబాద్ సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి బహిరంగ విచారణ చేపట్టారు. సబ్‌కలెక్టర్, శిశుసంక్షేమ శాఖ జిల్లా అధికారులు గ్రామానికి చేరుకుని బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ముందుగా సబ్‌కలెక్టర్ బాలిక నానమ్మ మొగులమ్మతో మాట్లాడుతూ వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. జరిగిన విషయం చెప్పాలని..ఎవరికీ భయపడొద్దని చెప్పారు. అయితే బాలికకు పెళ్లి జరగలేదని కుటుంబ సభ్యులు ముక్తకంఠంతో చెప్పారు.

 గ్రామస్తులను కూడా ఆమ్రపాలి ప్రశ్నించారు. ఏవైనా ఆధారాలుంటే ఇవ్వాలని కోరగా..ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమె వెనుదిరిగారు. సబ్‌కలెక్టర్ వెంట రెవెన్యూ, పోలీసు అధికారులు ఉన్నారు. కాగా బాలికను మంగళవారం రాత్రి తాండూరు నుంచి నగరంలోని నింబోలిఅడ్డ బాలికల హోంకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement