
సాక్షి,చిత్తూరు: శ్రీకాళహస్తి ఆలయంలో భక్తులను కొంతమంది నిలువు దోపిడి చేస్తున్నారు. భక్తుల రద్దీని సొమ్ము చేసుకుంటున్నారు.రాహు కేతు పూజల్లో అర్చకులు, సిబ్బంది కుమ్మకై భక్తుల నుంచి బలవంతంగా వసూళ్లు రాబడుతున్నారు. అక్కడి లగేజీ కౌంటర్ల వద్ద టీడీపీ నేతల అనుచరులు హల్‌చల్ చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. నిర్ణయించిన ధరల కన్నా అధికంగా వసూళ్లు ఎందుకని అడిగిన వారి మీద దాదాగిరి చేస్తున్నా.. ఆలయ అధికారులు పట్టించుకోవట్లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ధౌర్జన్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.