క్షణికావేశానికి లోనుకావద్దు | Sakshi
Sakshi News home page

క్షణికావేశానికి లోనుకావద్దు

Published Fri, Dec 2 2016 3:37 AM

క్షణికావేశానికి లోనుకావద్దు

హెచ్‌ఐవీకి మందులు లేవు.. నివారణ ఒక్కటే మార్గం
ప్రపంచ ఎయిడ్స్ దినం సభలోడీఎంహెచ్‌ఓ
విద్యార్థులతో ర్యాలీ

 
ఒంగోలు సెంట్రల్ : హెచ్‌ఐవీ వ్యాధికి చికిత్స లేదని నివారణ ఒక్కటే మార్గమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె. యాస్మిన్ అన్నారు. ప్రపంచ ఎరుుడ్‌‌స దినం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధ్వర్యంలో గురువారం స్థానిక అంబేడ్కర్ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. హెచ్‌ఐవీకి గురైన అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువతీ యువకులు క్షణికావేశానికి లోను కాకూడదని హెచ్చరించారు. 15 నుంచి 49 ఏళ్ల వయసు గల వారు ఎక్కువగా ఈ వ్యాధికి గురి అవుతున్నారని చెప్పారు. దీని నివారణకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.  

పౌష్టికాహారం తీసుకోవాలి
 నయంకాని వ్యాధి బారిన పడినవారు పౌష్టికాహారం తీసుకుంటూ ఏఆర్‌టీ మందులు వాడితే తమ జీవిత కాలాన్ని పొడిగించుకోవచ్చని డీఎంహెచ్‌ఓ తెలిపారు. ఈ వాధివల్ల మరణించిన వారి పిల్లలు అనాథలుగా మారుతున్నారని తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి టి. రాజా వెంకటాద్రి మాట్లాడతూ ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంగా పని చేస్తే ఈ మహమ్మారిని నిర్మూలించవచ్చన్నారు. దీని వ్యాప్తిలో భారత దేశం ప్రపంచంలో మూడో స్థానంలో ఉందన్నారు. వ్యాధిగ్రస్తులకు స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని కోరారు. ముందుగా కలెక్టర్ కార్యాలయం వద్ద ఎరుుడ్‌‌స ర్యాలీని ప్రారంభించారు.

 ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఇక్కడ సంయుక్త కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్ మాట్లాడుతూ ఎరుుడ్‌‌స వ్యాధికి నివారణే మార్గమని తెలిపారు. అవగాహనతోనే  అరికట్టాలన్నారు. ఎరుుడ్‌‌స, లెప్రసీ విభాగం అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. పద్మావతి, రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ వల్లీశ్వరి, జిల్లా క్షయ నివారణ అధికారి టి. రమేష్,  జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సరళాదేవి, అదనపు డీఎంహెచ్‌ఓ శకుంతల, ఏపీవీవీ ఇన్‌చార్జి కో ఆర్డినేటర్ ఉష, రిమ్స్ వైద్యులు డాక్టర్ జోసఫ్ శామ్యూల్, డాక్టర్ బాలాజీ నాయక్, కిరణ్మరుు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, నర్సింగ్, ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.  
 
ఎన్‌సీసీ..ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో..
 ఒంగోలు కల్చరల్ : వరల్డ్ ఎరుుడ్‌‌స డే పురస్కరించుకుని గురువారం స్థానిక సీఎస్‌ఆర్ శర్మ కళాశాల విద్యార్థులు, ఎన్‌సీసీ క్యాడెట్లు, జాతీయ సేవా పథకం వలంటీర్లు ర్యాలీ నిర్వహించారు. కళాశాల నుంచి ప్రకాశం భవనం వరకు వెళ్లారు.   ప్రిన్సిపాల్ మొలకలపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఎన్‌సీసీ క్యాడెట్లు, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు కృషి చేయాలని కోరారు. ఎసీసీసీ ఆఫీసర్ కె. మనోజ్ఞకుమార్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శాస్త్రి, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement