
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈస్ట్‌కోస్ట్‌రైల్వే వాల్తేర్ డివిజన్ పరిధిలో విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు పలు సువిధ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు సీనియర్ డీసీఎం జి.సునీల్‌కుమార్ తెలిపారు. విశాఖపట్నం–సికింద్రాబాద్(08503)సువిధ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ జనవరి 9, 16 తేదీలలో విశాఖపట్నంలో రాత్రి 11గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో(08504) సికింద్రాబాద్‌లో జనవరి 10, 17 తేదీలలో సాయంత్రం 4.30గంటలకు బయల్దేరి మరుసటిరోజు తెల్లవారు 4.50గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు 2–సెకండ్ ఏసీ, 4–థర్డ్ ఏసీ, 9–స్లీపర్ క్లాస్, 5–జనరల్ సెకండ్ క్లాస్, 2–సెకండ్ క్లాస్ కం లగేజీ కోచ్‌లతో నడుస్తుంది.
విశాఖపట్నం–సికింద్రాబాద్(08505) సువిధ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ జనవరి 11, 13, 17, 20తేదీలలో విశాఖపట్నంలో రాత్రి 11గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో(08506) సికింద్రాబాద్‌లో జనవరి 12,14,18,21 తేదీలలో సాయంత్రం 4.30గంటలకు బయల్దేరి మరుసటిరోజు తెల్లవారు 4.50గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు 3–థర్డ్ ఏసీ, 10–స్లీపర్ క్లాస్, 3–జనరల్ సెకండ్ క్లాస్, 2–సెకండ్ క్లాస్ కం లగేజీ కోచ్‌లతో నడుస్తుంది.ఈ స్పెషల్ రైళ్లు రాను పోను దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేట స్టేషన్‌లలో ఆగుతుంది.