పద్ధతి మార్చుకోకుంటే తాటతీస్తామని రౌడీషీటర్లకు నెల్లూరు జిల్లా ఎస్పీ విషాల్ గున్ని హెచ్చరించారు.
నెల్లూరు : పద్ధతి మార్చుకోకుంటే తాటతీస్తామని రౌడీషీటర్లకు నెల్లూరు జిల్లా ఎస్పీ విషాల్ గున్ని హెచ్చరించారు. నగరంలోని ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో శుక్రవారం సుమారు 100 మంది రౌడీషీటర్లకు నూతన ఎస్పీ విషాల్ గున్ని కౌన్సెలింగ్ ఇచ్చారు. పద్ధతి మార్చుకోకుంటే తాట తీస్తామని హెచ్చరించారు. గతంలో మాదిరిగా ఉంటే కుదరదని, ప్రతి ఒక్కరి కదలికలపై సునిశిత నిఘా పెడతామన్నారు. ఎటుంటి కేసుల్లోనైనా ప్రమేయం ఉంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇకపై మీరు హాయిగా ఉండి, ప్రజల్ని హాయిగా ఉండనివ్వాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రెడ్డి గంగాధర్, డీఎస్పీలు వెంకటరాముడు, తిరుమలేశ్వర్‌రెడ్డి, సీఐలు పాల్గొన్నారు.