వ్యవసాయమే జీవనాధారమైన డెల్టాలో సార్వా సాగు సారూప్యత లేకుండా సాగుతోంది. కొన్నిచోట్ల నాట్లు పూర్తరుు నేడోరేపో పొట్ట దశకు చేరుకునే పరిస్థితులుండగా, మరికొన్ని చోట్ల నాట్లు కూడా పడలేదు. నారుపోసి, పొలాన్ని దమ్ము చేసే పనిలో రైతులు నిమగ్నమై ఉన్నారు.
పాలకొల్లు, న్యూస్‌లైన్ : వ్యవసాయమే జీవనాధారమైన డెల్టాలో సార్వా సాగు సారూప్యత లేకుండా సాగుతోంది. కొన్నిచోట్ల నాట్లు పూర్తరుు నేడోరేపో పొట్ట దశకు చేరుకునే పరిస్థితులుండగా, మరికొన్ని చోట్ల నాట్లు కూడా పడలేదు. నారుపోసి, పొలాన్ని దమ్ము చేసే పనిలో రైతులు నిమగ్నమై ఉన్నారు. కొంతమంది రైతులు పైరుకు ఎరువులు వేస్తుండగా మరికొందరు పురుగు మందుల పిచికారీ, కలుపుతీత వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. కనీసం 30 శాతం వ్యవసాయ క్షేత్రాల్లో రానున్న వారం రోజుల్లో నాట్లుపడే పరిస్థితి కనిపిస్తోంది. డెల్టాలో అధిక శాతం కుటుంబాలకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. అక్కడక్కడా కొందరు చేపలు, రొయ్యల సాగు చేస్తుండగా అతికొద్దిమంది మాత్రం కూరగాయలు పండిస్తున్నారు.
ఎక్కువమంది రైతులు, కూలీలు వరి సాగుపైనే ఆధారపడుతున్నారు. అరుుతే, సాగు విషయంలో రైతుల మధ్య సారూప్యత లేకపోవడంతో వరి విషయంలోనే ఒకే ప్రాంతంలో వ్యత్యాసం కనబడుతోంది. నియోజకవర్గంలోని పాలకొల్లు, యలమంచిలి, పోడూరు మండలాల్లో సుమారు 40 వేల ఎకరాల్లో వరి సాగవుతుండగా, కనీసం 10 వేల ఎకరాల్లో నేటికీ నాట్లు పడలేదు. పాలకొల్లు మండలం వరిధనంలో ఒక రైతు ముందుగా నాట్లు వేసిన పొలంలో ఇప్పటికే ఒక విడత ఎరువు వేయడం, కలుపుతీత, పురుగుల మందు పిచికారీ వంటి పనులు పూర్తి చేయగా, సమీపంలోని లంకలకోడేరులో రెండుమూడు రోజుల క్రితం నాట్లు వేశారు. యలమంచిలి మండలంలో నేటికీ దుక్కు చేయని పొలాలు దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు రైతులంతా దాదాపు వారం, పది రోజుల వ్యవధిలో నాట్లు పూర్తి చేసేవారు.
ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామానికి, గ్రామానికి మధ్య నెలరోజుల వ్యత్యాసం కనిపిస్తోంది. డెల్టా ఆధునికీకరణ పనుల కారణంగా కాలువలకు నీటి విడుదలలో జాప్యం, రైతులు నాట్లు వేసే సమయంలో భారీ వర్షాలు కురిసి నారుమళ్లు దెబ్బతినడం వంటి కారణాల నడుమ నాట్లు వేయడంలో వ్యత్యాసం కనబడుతోంది. ఆలస్యంగా నాట్లు వేస్తే దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని వ్యవసాయాధికారులు చెబుతుండగా, సార్వా జాప్యం ప్రభావం దాళ్వా పంటపై కూడా పడుతుందని, దీనవల్ల మూడో పంటగా ఆరుతడి పంటలు వేసుకునే అవకాశాన్ని కోల్పోతున్నామని రైతులు వాపోతున్నారు.