కృష్ణా, గుంటూరు జిల్లా రెవిన్యూ, పట్టణాభివృద్ధి అధికారులతో సింగపూర్ ప్రతినిధుల బృందం గురువారం భేటీ అయ్యింది.
హైదరాబాద్ : కృష్ణా, గుంటూరు జిల్లా రెవిన్యూ, పట్టణాభివృద్ధి అధికారులతో సింగపూర్ ప్రతినిధుల బృందం గురువారం భేటీ అయ్యింది. ఆపీ సచివాలయంలో మంత్రి నారాయణ నేతృత్వంలో రాజధాని ప్రాంతంలో భూముల వివరాలు, రాజధాని నిర్మాణం, భౌగోళిక పరిస్థితులపై సమీక్ష జరుపుతోంది. ఈ భేటీలో ఇరు జిల్లాల కలెక్టర్లతో పాటు, రాజధాని పరిధిలోని ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
కాగా రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అనువైన భూమిని పరిశీలించడానికి సింగపూర్ నుండి వచ్చిన బృందం... విజయవాడ - గుంటూరు జిల్లాలలో ఏరియల్ పర్యటన చేసింది. మరోవైపు సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో పాటు, మరో 15మంది సభ్యుల బృందం, ఏపీ ప్రభుత్వంతో మంగళవారం ప్రాథమిక చర్చలు జరిపింది.