సేవ్ ఎన్టీఆర్ స్టేడియం, ఇందిరా పార్క్ అనే నినాదాలతో లోక్‌సత్తా పార్టీ ఉద్యమాన్ని ప్రారంభించింది.
మారేడ్‌పల్లి (హైదరాబాద్) : సేవ్ ఎన్టీఆర్ స్టేడియం, ఇందిరా పార్క్ అనే నినాదాలతో లోక్‌సత్తా పార్టీ ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ మేరకు ఈస్ట్‌మారేడుపల్లిలోని తెలంగాణ శాఖ రాష్ట్ర కార్యాలయంలో గురువారం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ పాండురంగారావు మిస్డ్‌కాల్, పోస్టుకార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు.
సీఎం కేసీఆర్ ఎన్టీఆర్ స్టేడియం, ఇందిరా పార్కుల స్థానంలో తెలంగాణ భవన్, వినాయక్‌సాగర్‌ను నిర్మించాలని తలపెట్టటం సరికాదని అన్నారు. వాటిని వేరేచోట ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మేరకు తమతో కలసి పాల్గొనదలచిన వారు 8688047100 నంబర్‌కు మిస్ట్ కాల్ చేయాలని, లేదంటే పోస్టు కార్డు ద్వారా కేసీఆర్‌కు నిరసన లేఖలు రాయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఆయన మిస్డ్ కాల్ బ్యానర్ ఆవిష్కరించి, పోస్టు కార్డు రాస్తూ ఉద్యమాన్ని ప్రారంభించారు.