బస్సుపై తెలంగాణవాదుల దాడి | samaikya sankharavam bus telangana protestors attack | Sakshi
Sakshi News home page

బస్సుపై తెలంగాణవాదుల దాడి

Oct 28 2013 3:22 AM | Updated on May 25 2018 9:12 PM

సమైక్య శంఖారావం సభకు వెళ్లిన కనకాయలంక, అబ్బిరాజుపాలెం గ్రామాల వైఎస్సార్ సీపీ శ్రేణులపై తెలంగాణవాదులు దాడి చేశారు.

యలమంచిలి, న్యూస్‌లైన్ : సమైక్య శంఖారావం సభకు వెళ్లిన కనకాయలంక, అబ్బిరాజుపాలెం గ్రామాల వైఎస్సార్ సీపీ శ్రేణులపై తెలంగాణవాదులు దాడి చేశారు. రెండు గ్రామాల నుంచి సుమారు 35 మంది బస్సులో హైదరాబాద్ వెళ్లారు. తిరుగు ప్రయూణంలో శనివారం రాత్రి ఖాజీపేట వద్ద దారికాసిన తెలంగాణవాదులు బస్సుపై రాళ్ల వర్షం కురిపించారని ప్రత్యక్ష సాక్షి, కనకాయలంక గ్రామ వైసీపీ నాయకుడు గొల్లపల్లి శ్రీనివాస్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. వర్షం కురుస్తుండటంతో బస్సు నెమ్మదిగా వెళుతుండగా సుమారు 20 మంది యువకులు బస్సుపై రాళ్లు రువ్వినట్లు చెప్పారు. బస్సు అద్దాలు పగలడంతో పాటు క్లీనర్ మోకాలికి బలమైన గాయమైందని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement