సాక్షి జర్నలిజం స్కూల్‌ ఫలితాలు విడుదల  | Sakshi Journalism School 2019 Results | Sakshi
Sakshi News home page

సాక్షి జర్నలిజం స్కూల్‌ ఫలితాలు విడుదల 

Jun 24 2019 10:05 PM | Updated on Jun 25 2019 3:09 AM

Sakshi Journalism School 2019 Results

సాక్షి,  హైదరాబాద్‌ : సాక్షి జర్నలిజం స్కూల్‌  ప్రింట్, టీవీ, వెబ్‌ జర్నలిజం విభాగాల్లో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 9 న నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను స్కూల్‌ ప్రిన్సిపాల్‌ దిలీప్‌రెడ్డి సోమవారం విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా నుంచి రాత పరీక్షలో 175 మంది బృంద చర్చలు, ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. వీరికి జూలై 8 నుంచి  హైదరాబాద్‌ బంజారాహిల్స్, రోడ్‌ నంబర్‌ 1లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో బృంద చర్చలు, ఇంటర్వ్యూలు జరుగుతాయి. కాల్‌ లెటర్లను  www.sakshischoolofjournalism.com, www.sakshi eduction.com,sakshi.com  వెబ్‌సైట్లలో ఈనెల 28 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు హాల్‌టికెట్, కాల్‌ లెటర్, నాలుగు పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోలు , విద్యార్హతల సర్టిఫికెట్లు, వాటి జిరాక్స్‌లతో పాటు వయసు నిర్ధారణ కోసం పదోతరగతి మెమోను తప్పనిసరిగా తీసుకురావాలి. అభ్యర్థులు నిర్దేశిత తేదీన సూచించిన సమయానికి అరగంట ముందుగానే సాక్షి ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలి.

www.sakshi eduction.com

www.sakshischoolofjournalism.com

Advertisement
 
Advertisement
Advertisement