పరిహారం ఇవ్వకుంటే పనులు సాగనివ్వం | Saganivvam tasks without compensation | Sakshi
Sakshi News home page

పరిహారం ఇవ్వకుంటే పనులు సాగనివ్వం

Jun 7 2016 12:29 AM | Updated on May 29 2018 4:23 PM

మండలంలోని రావివలస గ్రామానికి చెందిన పలువురు రైతులు సోమవారం తోటపల్లి కాలువ పనులను అడ్డుకున్నారు.

లావేరు : మండలంలోని రావివలస గ్రామానికి చెందిన పలువురు రైతులు సోమవారం తోటపల్లి కాలువ పనులను అడ్డుకున్నారు. భూములకు పరిహారం చెల్లించిన తరువాతే కాలువ తవ్వాలని స్పష్టం చేశారు. రావివలస, శీర్లపాలెం రెవెన్యూ పరిధిలోని భూములను తోటపల్లి కాలువ కోసం అధికారులు సేకరించారు. ఇంతవరకురైతులకు పరిహారం చెల్లించలేదు. రావివలస గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ మండల ప్రధాన కార్యదర్శి దేశెట్టి తిరుపతిరావు, దేశెట్టి దుర్గారావు, దేశెట్టి ఆదినారాయణ, రాంబాబు, బంగారప్పడు, రమణ, పసుపురెడ్డి అప్పారావు, పందిరిపల్లి తిరుపతిరావు తదితరులు సోమవారం తోటపల్లి కాలువ పనులను అడ్డుకున్నారు.
 
 ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మార్చి నెలాఖరు నాటికి రైతులకు పరిహారం చెల్లిస్తామని గతంలో భూసేరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, లావేరు తహసీల్దారు హామీ ఇచ్చారని, నేటికీ అతీగతీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు మాట తప్పడం భావ్యంగా లేదని అన్నారు. కాలువ కల్వర్టు పనులు చేపట్టకుండా రైతులు అడ్డుకోవడంతో కూలీలు వెనుతిరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement