చౌక విద్యుత్‌ వల్ల రూ.700 కోట్లు ఆదా

Rs 700 crores saves due to cheap electricity - Sakshi

విద్యుత్‌ సంస్థల అరుదైన రికార్డు 

డిస్కమ్‌ల బలోపేతానికి పటిష్ట చర్యలు 

9 గంటల ఉచిత విద్యుత్‌కు పక్కా ప్రణాళిక

సాక్షి, అమరావతి:  విద్యుత్‌ కొనుగోళ్లలో స్వీయ నియంత్రణ పాటించడం వల్ల ఏడాది కాలంలోనే డిస్కమ్‌లు రూ.700 కోట్లు ఆదా చేశాయని రాష్ట్ర ఇంధన శాఖ వెల్లడించింది. రాష్ట్ర చరిత్రలో ఇదో రికార్డుగా పేర్కొంది. ఏడాది కాలంలో సాధించిన పురోగతిని వివరిస్తూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. 

సబ్సిడీ బకాయిలు చెల్లింపుతో. 
► గత ప్రభుత్వ హయాంలో 2019 మార్చి 31 నాటికి విద్యుత్‌ సబ్సిడీ బకాయిలు రూ.13,391 కోట్లు ఉన్నాయి. 
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చాక 2019–20లో రూ.8,655 కోట్లను డిస్కమ్‌లకు ప్రభుత్వం చెల్లించింది.  
► విద్యుత్‌ సబ్సిడీ కింద మరో రూ.9,249 కోట్లను (మొత్తం రూ.17,904 కోట్లు) చెల్లించింది. 
► విద్యుత్‌ ఉత్పత్తిదారులకు డిస్కమ్‌లు చెల్లించాల్సిన బకాయిల నిమిత్తం 2019–20లో రూ.20,384 కోట్లు విడుదల చేసింది. డిస్కమ్‌లు మరో రూ.14 వేల కోట్లను ఉత్పత్తిదారులకు చెల్లించాయి.  

రైతులకు ఉచిత విద్యుత్‌ 
► రాష్ట్రంలోని 18.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు వచ్చే రబీ సీజన్‌ ప్రారంభం నాటికల్లా పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్‌ అందించాలని 
విద్యుత్‌ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది.  
► ఇప్పటికే 81 శాతం ఫీడర్ల పరిధిలో ఉచిత విద్యుత్‌ సరఫరా అవుతోంది. మిగిలిన ఫీడర్ల పరిధిలో విద్యుత్‌ సరఫరా మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు, నూతన సబ్‌ స్టేషన్ల నిర్మాణం, విద్యుత్‌ లైన్ల  ఆధునికీకరణ నిమిత్తం ప్రభుత్వం రూ.1,700 కోట్లు విడుదల చేసింది.  
► విద్యుత్‌ సంస్థల పురోగతిపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ.. వ్యవసాయానికి పగటి పూటే ఉచిత విద్యుత్‌ సరఫరా చేయాలనే ముఖ్యమంత్రి నిర్ణయం విప్లవాత్మకమైందన్నారు. ఈ పథకం కోసం  ప్రభుత్వం రూ.8,353.58 కోట్లు కేటాయించిందన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top