వ్యాన్ బోల్తా..ఒకరి మృతి | road accident in kurnool distirict | Sakshi
Sakshi News home page

వ్యాన్ బోల్తా..ఒకరి మృతి

May 2 2015 11:22 AM | Updated on Sep 3 2017 1:18 AM

కర్నూలు జిల్లా వెల్దుర్తి జాతీయ రహదారిపై పెట్రోల్ బంకు వద్ద వ్యాన్ బోల్తా పడింది.

కర్నూలు : కర్నూలు జిల్లా వెల్దుర్తి జాతీయ రహదారిపై పెట్రోల్ బంకు వద్ద వ్యాన్ బోల్తా పడింది. వ్యాన్ వెనక, ముందు టైర్లు ఒకేసారి పంక్చర్ కావడం వల్లే బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ క్లీనర్ ఉపేంద్ర(40) అక్కడిక్కడే మరణించాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉపేంద్ర స్వగ్రామం నల్గొండ జిల్లా తిరుమలగిరి. క్షతగాత్రులను హుటాహుటిన కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
(వెల్దుర్తి)
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement