బాబు ప్రయత్నమంతా టీడీపీని కాపాడుకోవడానికే: రేవూరి | Revuri Prakash reddy supports TDP | Sakshi
Sakshi News home page

బాబు ప్రయత్నమంతా టీడీపీని కాపాడుకోవడానికే: రేవూరి

Jan 23 2014 5:10 AM | Updated on Aug 10 2018 8:01 PM

తెలంగాణ సెంటిమెంట్‌తో టీడీపీని దెబ్బతీయొద్దని ఆ పార్టీ సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సెంటిమెంట్‌తో టీడీపీని దెబ్బతీయొద్దని ఆ పార్టీ సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం అసెంబ్లీలో టీ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘తెలంగాణలో టీఆర్‌ఎస్ మమ్మల్ని టార్గెట్ చేస్తే సీమాంధ్రలో జగన్ టీడీపీ లేఖ ఇవ్వడం వల్లనే విభజన జరుగుతోందని ప్రచారం చేస్తున్నారు. టీడీపీని అన్ని ప్రాంతాల్లో కాపాడుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు’’ అని చెప్పారు. తెలంగాణ ఉద్యమం ఉధృతం కావడానికి టీఆర్‌ఎస్ దోహదపడిందని, అంతమాత్రాన తమతోనే తెలంగాణ వచ్చిందనుకుంటే అమాయకత్వమేనని రేవూరి వ్యాఖ్యానించారు. తెలంగాణను కాంగ్రెస్ ప్రేమతో ఇవ్వట్లేదని, రాజకీయ కుట్ర, లబ్ధి కోసమే ఇస్తోందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement