ఈ-టెండర్ల ద్వారా ఎర్రచందనం వేలం | Red sandal action by global tenders bojjala gopalakrishna reddy | Sakshi
Sakshi News home page

ఈ-టెండర్ల ద్వారా ఎర్రచందనం వేలం

Jul 14 2014 1:26 PM | Updated on Apr 3 2019 5:55 PM

అటవీశాఖ గిడ్డంగులోని ఎర్రచందనం నిలువలను వేలం వేయడానికి కేంద్రం అనుమతి ఇచ్చిందని ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు.

హైదరాబాద్ : అటవీశాఖ గిడ్డంగులోని ఎర్రచందనం నిలువలను వేలం వేయడానికి  కేంద్రం అనుమతి ఇచ్చిందని ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ  మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ 8,584 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని విక్రయించేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎర్రచందనం నిల్వల విక్రయానికి 15 రోజుల్లోగా గ్లోబల్ టెండర్లను ఆహ్వానించాలని ఆదేశించారు.

తొలివిడతగా నాలుగు వేల టన్నుల ఎర్ర చందనాన్ని వేలం వేయనున్నట్లు బొజ్జల తెలిపారు. ఈ-ఆప్షన్ విధానాన్ని అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు. వారంలోగా టెండర్లు ఆహ్వానిస్తామన్నారు. అయిదు లక్షల హెక్టార్లలో ఎర్రచందనం విస్తరించి ఉందని ఆయన చెప్పారు. ఎర్రచందనం స్మగ్లింగ్కు అడ్డుకట్ట వేస్తామని ఆయన తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement