
'తెలంగాణలో ఆంధ్ర విద్యార్థులకు అండగా ఉంటాం'
తెలంగాణలో ఉన్న సీమాంధ్ర విద్యార్థులుకు అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి రావెల కిషోర్ బాబు స్పష్టం చేశారు.
తెలంగాణలో ఉన్న సీమాంధ్ర విద్యార్థులుకు అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి రావెల కిషోర్బాబు స్పష్టం చేశారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రావెల కిషోర్ బాబు గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్లో ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని యధావిధిగా కొనసాగిస్తామని తెలిపారు. ఎస్పీ, ఎస్టీ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు రానివ్వమని వెల్లడించారు. సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం కాకుండా చూస్తామని కిషోర్ బాబు చెప్పారు.