జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు రాంపల్లి విద్యార్థులు | Rampally students selected to National archery games | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు రాంపల్లి విద్యార్థులు

Dec 21 2013 12:35 AM | Updated on Mar 28 2018 10:59 AM

ఇబ్రహీంపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయిలో విలువిద్య పోటీల్లో రాంపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

కీసర, న్యూస్‌లైన్: ఇబ్రహీంపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయిలో విలువిద్య పోటీల్లో రాంపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు  ప్రతిభకనబర్చిన విద్యార్థులను శుక్రవారం పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేణు మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నంలో జరిగిన రాష్ర్టస్థాయి పోటీల్లో అండర్- 14 బాలికల విభాగంలో తమ పాఠశాలకు చెందిన వి.స్రవంతి (8వ తరగతి), ఆఫ్రిన్ (8వ తరగతి) వె ండి పతకాలను సాధించడంతోపాటు జాతీయస్థాయికి ఎంపికయ్యారన్నారు.
 
 అండర్-14 బాలుర విభాగంలో విష్ణు (8వ త రగతి), వంశి (8వ తరగతి) వెండి పతకాలు దక్కించుకున్నట్లు చెప్పారు. అండర్-17 విభాగంలో పి.నూతన్‌కుమార్ (10వ తరగతి) కాంస్య పతకం సాధించాడన్నారు. అండర్ -19 విభాగంలో గ్రామానికి చెందిన ఆర్.నాగరాజు బంగారు పతకాన్ని సాధించడం సంతోషంగా ఉందన్నారు. నాగరాజు గతంలో తమ పాఠశాలలోనే పదో తరగతి పూర్తి చేసుకున్నాడని, వచ్చేనెలలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడన్నారు. ఇటీవల విజయవాడలో రాష్ట్రస్థాయి పైకా పోటీల్లోనూ తమ పాఠశాల విద్యార్థులు కావ్య, ప్రియాంక, ఆఫ్రిన్, కె.నాగేష్ వెండి పతకాలు సాధించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

పోల్

Advertisement