
'సీమాంధ్రను బాబు బీజేపీకి తాకట్టు పెట్టారు'
సీమాంధ్రను సీఎం చంద్రబాబు బీజేపీకి తాకట్టు పెట్టారని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్: సీమాంధ్రను సీఎం చంద్రబాబు బీజేపీకి తాకట్టు పెట్టారని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. గురువారం హైదరాబాద్లో రఘువీరారెడ్డి మాట్లాడుతూ... ఏపీకి రూ. 350 కోట్లంటూ కేంద్రం చేసిన ప్రకటన తెలుగు ప్రజలను అవమానించేలా ఉందని అన్నారు. రూ. 24,350 కోట్లు అడిగితే కేవలం రూ. 350 కోట్లు మాత్రమే మంజూరు చేశారని విమర్శించారు.
బడ్జెట్ లోటును పూడ్చేందుకు రూ. 13500 కోట్లు అడిగితే రూ. 500 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సీమాంధ్రుల హక్కు అని రఘువీరారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.