
ఆ ప్రకటనలపై నోరెందుకు మెదపడంలేదు?
కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ. 1.40 లక్షల కోట్లు సాయం చేశామని, కేంద్రం సహకరించడం లేదని దుష్ర్పచారం చేయడం సరికాదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇటీవల రాజమహేంద్రవరంలో పేర్కొన్నా వాటిపై సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబుకు రఘువీరారెడ్డి ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ. 1.40 లక్షల కోట్లు సాయం చేశామని, కేంద్రం సహకరించడం లేదని దుష్ర్పచారం చేయడం సరికాదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇటీవల రాజమహేంద్రవరంలో పేర్కొన్నా వాటిపై సీఎం చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఇందిర భవన్‌లో విలేకర్లతో మాట్లాడారు.
ప్రత్యేక హోదా విషయమై 12న 300 మంది కాంగ్రెస్ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే సేకరించిన కోటి సంతకాల ప్రతులు, మట్టి సత్యాగ్రహ కలశాన్ని ప్రధానికి అందజేసి ప్రత్యేక హోదా, 2018 నాటికి పోలవరం పూర్తిచేయడం విభజన హామీల అమలుకు డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు.