వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేశారు.
వరంగల్, న్యూస్‌లైన్: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేశారు. 15 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెడిసిన్ ఫైనలియర్ చదువుతున్న పి.అనూష్‌యాదవ్, పృథ్వీరాజ్ ఫిబ్రవరి 13వ తేదీన ఫస్టియర్ విద్యార్థి ప్రేమ్‌చంద్‌ను ర్యాగింగ్ చేసినట్టు కేఎంసీ ప్రిన్సిపాల్ రాంచందర్ దరక్ శుక్రవారం తెలిపారు. ఈ విషయాన్ని బాధితుడు ఫిబ్రవరి 19న ఫిర్యాదు చేయగా.. కళాశాల క్రమశిక్షణ కమిటీ సభ్యులు, హాస్టల్ వార్డెన్‌తో విచారణ జరిపామని చెప్పారు. రుజువు కావటంతో సీనియర్ విద్యార్థులు అనూష్‌యూదవ్, పృథ్వీరాజ్‌ను ఆరు నెలల పాటు సస్పెండ్ చేయూలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సిఫారసు చేసినట్టు ప్రిన్సిపాల్ తెలిపారు.