ఐటీబీపీ క్యాంప్‌లో తెలుగువారికి ముగిసిన క్వారంటైన్

సాక్షి, న్యూఢిల్లీ : ఇటలీ నుంచి దేశ రాజధానికి వచ్చిన 36 మంది తెలుగు వారికి ఐటీబీపీ క్యాంప్‌లో బుధవారం క్వారంటైన్ ముగిసింది. ప్రస్తుతం వారిని తమ స్వస్థలాలకు పంపేందుకు ఏపీ భవన్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో కేంద్రం అనుమతి కోసం ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భవన సక్సేనా ఎదురు చూస్తున్నారు. అనుమతులు వచ్చిన వెంటనే బస్సుల్లో స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కమిషనర్ తెలిపారు. కేంద్రం అనుమతి వచ్చే వరకు ఎక్కడివారు అక్కడే ఉండాలని ఆయన సూచించారు. అలాగే ఏవైనా సమస్యలు ఉంటే apbhavancovid19@gmail.comకు మెయిల్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
(పదేళ్ల తర్వాత మళ్లీ ఆ డైరెక్టర్‌తో మహేష్ సినిమా? )