రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి చెప్పారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలన్నింటినీ చిత్తశుద్ధితో అమలు చేసి ప్రభుత్వ ఆశయాలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. అధికార యంత్రాంగంతో పాటు ప్రజలు కూడా ఇందుకు సహకరించాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా పలు రంగాల్లో ఇప్పటికే మంచి స్థానంలో ఉందని, మరింత కృషి చేయడం ద్వారా రాష్ట్రంలోనే జిల్లాను అభివృద్ధి పథాన మొదటి స్థానంలో నిలుపుతానని చెప్పారు. అభివృద్ధి ఫలాలను ప్రజలకు మరింత చేరువ చేస్తానని ఆయన వెల్లడించారు.
-కలెక్టర్. సత్యనారాయణ రెడ్డి