‘కృష్ణా’లో వీసీ నియామకంపై కుమ్ములాట

Professors Doing Protest About Vice-Chancellor Recruitment In Krishna University - Sakshi

సాక్షి, మచిలీపట్నం : కృష్ణా యూనివర్సిటీ ఇన్‌చార్జి వీసీగా సుందరకృష్ణ నియామకాన్ని ఆహ్వానిస్తూనే కొంతమంది ప్రొఫెసర్‌లు ప్రస్తుతం ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా ఉన్న డాక్టర్‌ ఎన్‌. ఉషను వెంటనే మార్చాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎనిమిది సీనియర్‌ రెగ్యూలర్‌ ప్రొఫెసర్‌లు సంతకాలు చేసిన లేఖను గురువారం ఇన్‌చార్జి వీసీ సుందరకృష్ణకు అందజేశారు. ప్రొఫెసర్‌లు, పాలనాధికారులతో ఇన్‌చార్జి వైస్‌ చాన్స్‌లర్‌ సుందరకృష్ణ గురువారం సమావేశం నిర్వహించారు.

అయితే సమావేశం అనంతరం కొంతమంది సీనియర్‌ ప్రొఫెసర్‌లు ఇన్‌చార్జి వైస్‌ చాన్స్‌లర్‌ను కలసి వర్సిటీకి నూతన రిజిస్ట్రార్‌ను నియమించాలని కోరారు. ఆ లేఖను రిజిస్ట్రార్‌కు ఇవ్వాలని ఇన్‌చార్జి వైస్‌ చాన్స్‌లర్‌ సూచించగా, రిజిస్ట్రార్‌ను మార్చాలనే డిమాండ్‌తో లేఖ ఇస్తున్నందున నేరుగా మీకే అందజేస్తున్నామని ప్రొఫెసర్‌లు తెలిపారు. దీంతో ఇన్‌చార్జి వీసీ వారు ఇచ్చిన లేఖను తీసుకున్నారు. ఆ సమయంలో ప్రస్తుతం ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్‌ ఎన్‌. ఉష కూడా అక్కడే ఉండటం గమనార్హం.   దీనిపై స్పందించిన ఇన్‌చార్జి వీసీ పరిశీలన చేస్తామని వారికి హామీ ఇచ్చారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top