విజయవాడలో తొలగించిన పురాతన హిందూ ఆలయాలను పునఃనిర్మించాలని కోరుతూ హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి భీమవరంలోని కోదండ రామాలయం వద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.
భీమవరం: విజయవాడలో తొలగించిన పురాతన హిందూ ఆలయాలను పునఃనిర్మించాలని కోరుతూ హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి భీమవరంలోని కోదండ రామాలయం వద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.
ఆలయాలు పునఃనిర్మించే వరకూ ఇక నుంచి ప్రతి ఆలయంలో ప్రత్యేక పూజలు, శ్రీరామజపం చేపడుతున్నామని హిందూ ఆలయాల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు తోరం సూర్యనారాయణ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని ఆలయాల వద్ద మన హిందూ దేవాలయాలను మనమే కాపాడుకొందాం అనే నినాదంతో ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. పరిరక్షణ సమితి కన్వీనర్ గరికిముక్కు సుబ్బయ్య మాట్లాడుతూ అధికార పక్ష రాజకీయ నాయకుల అండదండలతో ఆలయాల కూల్చివేత జరుగుతుందన్నారు. కార్యక్రమంలో క్రొవ్విడి రవికుమార్ శర్మ, పాదన్న శ్రీధర్, కమతం బాలు పాల్గొన్నారు.