వైభవంగా ధ్వజస్తంభం ప్రతిష్ఠ | Prestige tower grandly | Sakshi
Sakshi News home page

వైభవంగా ధ్వజస్తంభం ప్రతిష్ఠ

Oct 24 2013 4:19 AM | Updated on Sep 1 2017 11:54 PM

శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన బుధవారం ఎంతో వైభవోపేతంగా జరిగింది. ఆలయంలోని స్వామివారి సన్నిధికి ఎదుట నూతన ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపనను శాస్త్రోక్తగా నిర్వహించారు.

శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన బుధవారం ఎంతో వైభవోపేతంగా జరిగింది. ఆలయంలోని స్వామివారి సన్నిధికి ఎదుట నూతన ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపనను శాస్త్రోక్తగా నిర్వహించారు. మొదట గురుదక్షిణామూర్తిని సర్వాంగసుందరంగా అలంకరిం చారు. తర్వాత గురుదక్షిణామూర్తి వద్దే పూజారులు, వేదపండితులు హోమం వెలిగించి మం త్రోచ్ఛారణలతో కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం పంచమూర్తులైన స్వామి, అమ్మవార్లు, వినాయకుడు, సుబ్రమణ్యస్వామి, క న్నప్ప, చండికేశ్వరుని పేర్లతో ధ్వజస్తంభానికి నాలుగు దిక్కుల పూజలు చేశారు. కలశాలలోని పవిత్ర జలాలను, రాగి నాణేలను ఉంచి   ప్రధాన అర్చకులు బాబుగురుకుల్, సాంబయ్య ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఆగమశాస్త్రం ప్రకారం ధ్వజస్తంభాన్ని ఆవిష్కరించారు.
 
ధ్వజాన్ని అభిషేకించిన ఆకాశగంగ..

 పూజల అనంతరం ధ్వజానికి అభిషేకం జరిపేందుకు వేదపండితులు, అర్చక స్వాము లు సన్నద్ధమవుతున్న తరుణంలో పెద్ద ఎత్తున వర్షం కురిసింది. దీంతో ధ్వజస్తంభం పూర్తిగా తడిసింది. ముక్కోటి దేవతలతోపాటు దివి నుంచి భువికి దిగివచ్చిన వరుణుడు స్వయం గా ఆకాశగంగతో స్వామివారి ధ్వజస్తంభాన్ని అభిషేకించాడంటూ వేదపండితులు, భక్తులు, ఆలయాధికారులు జయజయ ధ్వానాలు చేశా రు. ధ్వజస్తంభంపై పూలవర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీరామచంద్రమూర్తితో పాటు ఆలయాధికారులు గోపాలకృష్ణమూర్తి, కోదండరామిరెడ్డి, రామిరెడ్డి, నాగభూషణం, హరియాదవ్, లోకేష్, వెంకటేశ్వరరాజు, బాబు, లక్ష్మయ్య పాల్గొన్నారు.

శివయ్య ఆశీర్వాదంతోనే విజయవంతం

 శ్రీకాళహస్తి శివయ్య ఆశీర్వాదంతోనే ధ్వజ స్తం భాన్ని విజయవంతంగా ప్రతిష్ఠాంచామని ఆల య ఈవో శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన అనంతరం ఆయన విలే కరులతో మాట్లాడుతూ ప్రతిష్ఠాపన సమయం లో వర్షం రావడం శుభసూచికమన్నారు. ఆల య శిల్పసౌందర్యానికి ఎలాంటి విఘాతం ఏర్పకుండా ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయడం సాహసోపేతంగా మారిందని చెప్పారు. మొద ట ఆందోళన చెందామని, ఆ దేవుని దయతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా కార్యక్రమం ముగిసిందన్నారు. 112 ఏళ్ల తర్వాత శివయ్య ధ్వజ స్తంభా న్ని తన చేతులమీదుగా ప్రతిష్ఠించే భాగ్యం కలగడం ఎన్నో జన్మల పుణ్యఫలమని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement