నేరాలను అదుపులో పెట్టేందుకు స్పెషల్‌ డ్రైవ్‌

Police Officials Made Special Drive In Krishna District - Sakshi

సాక్షి, కృష్ణా : నేరాలను అదుపులో పెట్టేందుకు కృష్ణా జిల్లా పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. గంజాయి అమ్మకాలు, వ్యభిచార గృహాలు, పేకాట స్థావరాలు, రౌడీ షీటర్లు, ఆకతాయిలు, జులాయి గ్యాంగ్‌ల ఆటకట్టించేందుకు సెర్చ్‌ ఆపరేషన్‌ మొదలు పెట్టారు. పోలీసులు బృందాలుగా విడిపోయి తెల్లవారుజాము నుంచే మెరుపుదాడులు నిర్వహించి అనుమానిత ప్రాంతాల్లో నిర్భంధ తనిఖీలు నిర్వహించారు. శివారు ప్రాంతాల్లోని కాలనీలను చుట్టుముట్టి దిగ్బంధనం చేశారు. ఇటీవలే కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా అని ఆరా తీశారు. ఆధార్‌, ఇతర ఐడెంటీ కార్డులను పరిశీలించి ప్రతి ఒక్కరి డేటాను సేకరించారు. సరైన గుర్తింపు పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్లకు తరలించారు. కాగా, అనుమానితులను అదుపులోకి తీసుకొని నేరప్రవృత్తి మానుకోవాలని పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top