పందెం కోళ్లు, నగదు ఓ పోలీస్‌ స్వాహా.. అరెస్టు 

Police Constable Arrested In Cheating Rajahmundry - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం: తనకు సంబంధంలేని పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరుగుతున్న కోడిపందేలపై దాడి చేసి, అక్కడ కోళ్లను, నగదును స్వాహా చేయడానికి ప్రయత్నించాడు ఓ కానిస్టేబుల్‌. వివరాల్లోకి వెళితే.. బొమ్మూరు పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ రమణ గురువారం   త్రీటౌన్‌ పరిధి లోని లూథరన్‌ గిరి వెనుక వైపు జరుగుతున్న కోడిపందేలపై దాడి చేశాడు. అతడిని చూసి పందెగాళ్లు పారిపోయారు.

అక్కడే ఉన్న కోళ్లు, నగదును కానిస్టేబుల్‌ రమణ స్వాహా చేసేందుకు ప్రయత్నించాడు. ఇది తెలుసుకున్న త్రీటౌన్‌ కానిస్టేబుళ్లు అతడిని పట్టుకొని త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. అతడిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. దీనిపై త్రీటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ శేఖర్‌ బాబును వివరణ కోరగా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కానిస్టేబుల్‌ రమణపై అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. 

చదవండి : ఏటీఎం కార్డులు మార్చడంలో ఘనుడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top