నలుగురి హత్యకు కుట్ర.. అరెస్టు

Police Arrested Nine People In Attempting Murder Case Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం : నలుగురిని హత్యచేయడానికి కుట్రపన్నిన దుండగులను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది. తాడిపత్రి, బత్తలపల్లి, కల్యాణదుర్గం ప్రాంతాలలో ఓ నలుగురిని హత్య చేసేందుకు వీరు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ముందుగానే పసిగట్టిన పోలీసులు హత్యలకు ప్రయత్నించిన 9మందిని అదుపులోకి తీసుకొని విచారించారు. వీరి దగ్గర 6 వేట కొడవళ్లు, పేలుడు పదార్థాలైన 15 డిటోనేటర్లు, 15 జిలెటిన్‌ స్టిక్స్‌ స్వాధీనం చేసుకున్నారు. అలాగే 400 గ్రాముల బాంబు తయారీ పౌడర్‌ సైతం వీరి దగ్గర ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కేసు నమోదు చేసి మరింత వివరాల కోసం లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top