అటు బస్సులు..ఇటు కస్సుబుస్సులు

People Suffered With RTC Bus Ban For CM Deeksha - Sakshi

బాబు దీక్ష  సేవలో ఆర్టీసీ

మండుటెండలో ప్రయాణికుల నిరీక్షణ

పలు మార్గాల్లో ఆర్టీసీ సర్వీసులు రద్దు

ముందుగా సమాచారం చెప్పని అధికారులు

ప్రైవేటు వాహనాల్లో తరలిన వైనం

సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్ష ప్రయాణికులపాలిట శిక్షగా మారింది. దీక్షకుజనాన్ని తరలించాలనే ఉద్దేశంతో ఆర్టీసీ బస్సులను అటు తరలించడం పెద్ద సమస్యగానెలకొంది. వివిధ రూట్లలో  తిరిగే బస్సులు రద్దు కావడంతోవిషయం తెలియని జనంగంటల తరబడి బస్‌స్టేషన్ల వద్దనిరీక్షించాల్సి వచ్చింది. మండతున్న ఎండ, ఉక్కపోతతోవిజయవాడ బస్టాండ్‌లో  ప్రయాణికులు విసుగెత్తిపోయారు. గత్యంతరం లేకప్రైవేటు వాహనాలు ఆశ్రయించితమ గమ్యస్థానాలకు పయనమయ్యారు. మరో వైపు దీక్షకు తరంచేందుకు ఏర్పాటు చేసినఆర్టీసీ బస్సులను ప్రజలెవ్వరూఎక్కకపోవడంతోఖాళీగాదర్శనమిచ్చాయి.

సాక్షి, అమరావతిబ్యూరో/విజయవాడ/ బస్‌స్టేషన్‌ : పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా మారింది  సీఎం చంద్రబాబు విజయవాడలో శుక్రవారం చేపట్టిన ధర్మపోరాట దీక్ష. వివిధ మార్గాల్లో తిరిగే వందలాది ఆర్టీసీ బస్సులు రద్దు చేశారనే విషయాన్ని ప్రజలకు ముందుగానే తెలియజేయకపోవడంతో తీవ్రఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తమ నివాస ప్రాంతాల నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, రోగులు, అత్యవరస ప్రయాణాలు పెట్టుకున్న వారు  బస్సులు లేక పడరాని పాట్లు పడ్డారు. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఆటోలు, ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాల డ్రైవర్లు చార్జీలు అధిక మొత్తంలో వసూలు చేశారు. దీక్ష శిబిరానికి వచ్చేందుకు ఏర్పాటుచేసిన బస్సుల్లో ప్రజలు ఎక్కకపోవడంతో ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. అవనిగడ్డ, గుడివాడ, మచిలీపట్నం, తిరువూరు, గన్నవరం తదిరత ప్రాంతాల్లో దీక్షకు వచ్చే ప్రజలు కరువవ్వడంతో జనం కోసం ఎదురు చూస్తూ బస్సులన్నీ అక్కడే ఉండిపోయాయి.

బస్సుల తరలింపు ఇలా..!
కృష్ణా జిల్లా పరిధిలో ఆర్టీసీ 1406 బస్సులు ఉన్నాయి. అందులో రూరల్‌ పరిధిలో 745 ఉండగా, సిటీ పరిధిలో 661 సర్వీసులు ఉన్నాయి. వీటిలో రూరల్‌ ప్రాంతానికి చెందిన బస్సుల్లో 221, సిటీలోని 383 బస్సుల్ని మొత్తం మీద 604 సర్వీసులు దీక్షా శిబిరానికి ప్రజలను తరలించేందుకు  కేటాయించారు. ప్రతి మండలానికి 10 నుంచి 15 వరకు బస్సులు ఏర్పాటుచేశారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి ప్రజల్ని రప్పించేందుకు అక్కడి రీజియన్‌ బస్సులు కాకుండా కృష్ణా రీజియన్‌కు చెందిన 185 సర్వీసులు తీసుకెళ్లారు.

శిబిరం వద్ద అవస్థలు...
దీక్షా శిబిరానికి వచ్చిన ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. తమను తీసుకొచ్చిన ఆర్టీసీ బస్సులు బీఆర్‌టీఎస్‌ రోడ్డు, సిదార్ధ కళాశాలలో పార్కింగ్‌ చేశారు. దీంతో వెళ్లేటప్పుడు చాలా దూరం నడిచి వెళ్లి బస్సులు ఎక్కాల్సి రావడంతో అసౌకర్యానికి గురయ్యారు. వికలాంగులు, అంధుల్ని సైతం దీక్ష వద్దకు తీసుకురావడంతో నరకయాతన అనుభవించారు. చాలా మందికి టిఫెన్లు అందకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. బిస్కెట్లు, కేకు, ప్రూటీతో కూడిన ప్యాకెట్లు వందలాది మందికి అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్‌కు చెందిన స్కూల్‌  చెందిన చిన్నారుల్ని, నర్సింగ్‌  స్కూల్‌ విద్యార్థుల్ని సైతం తీసుకురావడంతో అవస్థలు ఎదుర్కొన్నారు. ఎండ ప్రభావానికి దీక్ష వద్దకు వచ్చిన వారు అల్లాడిపోయారు. కనీసం గంట కూడా కూర్చోకుండానే వెనుదిరిగారు.

నగరంలో ట్రాఫిక్‌ జామ్‌...
నగరానికి నడిబొడ్డున సీఎం చంద్రబాబు చేసిన దీక్ష నగర వాసుల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. స్టేడియం ఆవరణలోనే నలందా కళాశాల ఉంది. అక్కడ పరీక్షలు జరుగుతున్నాయి. దీక్ష సందర్భంగా లౌడ్‌ స్పీకర్స్‌ ఏర్పాటు చేయడంతో విద్యార్థులు అసహనానికి గురయ్యారు. బందరు రోడ్డు, పుష్పా హోటల్‌ సెంటర్‌ రోడ్డు, ఐదవ నెంబర్‌ రూట్‌లలో తరుచుగా ట్రాఫిక్‌ జామ్‌ కావడం, సిగ్నల్స్‌ వద్ద వేచి ఉండాల్సి రావడంతో ప్రజలు అల్లాడిపోయారు. ఒకవైపు ఎండ తీవ్రత, మరొకవైపు ట్రాఫిక్‌ జామ్‌లతో చికాకు ఎదుర్కొన్నారు. ముందస్తు ఆలోచన లేకుండా ట్రాఫిక్‌ మళ్లించడంతో ఏలూరు రోడ్డులోనూ ట్రాఫిక్‌ జామ్‌ అయ్యాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top