దేదీప్యమానంగా..

People Successfully Completed Diya Jalao In AP Against Covid-19 - Sakshi

కరోనాపై పోరుకు ప్రజల నుంచి వెల్లువెత్తిన సంఘీభావం

రాష్ట్రమంతటా విజయవంతంగా ‘దీప ప్రజ్వలన’

దీపాలు వెలిగించిన సీఎం వైఎస్‌ జగన్, గవర్నర్‌ విశ్వభూషణ్‌ 

మహమ్మారిపై పోరులో ఒక్కటిగా నిలుద్దామని సీఎం ట్వీట్‌

మోదీ పిలుపునకు అన్ని వర్గాల నుంచి స్పందన

చప్పట్ల కార్యక్రమానికి ధీటుగా దీపాలు వెలిగించిన ప్రజలు

సాక్షి, అమరావతి: కరోనాపై పోరుకు సంఘీభావంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునకు.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన సమైక్యతను చాటాలని సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తికి.. రాష్ట్రం యావత్తూ సానుకూలంగా స్పందించింది. వాడవాడలా ప్రజలు ఆదివారం రాత్రి దీప ప్రజ్వలన చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో దీపాలు వెలిగించి కరోనా వైరస్‌పై పోరుకు సంఘీభావాన్ని తెలిపారు. ఆయనతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది కూడా దీపాలు వెలిగించారు. అలాగే, రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులు కూడా  రాజ్‌భవన్‌లో దీప ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ.. కరోనాపై పోరుకు సంఘీభావంగా ప్రజలు దీపాలు వెలిగించడం ద్వారా తమ ఐక్యతను చాటారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అందరూ దీపాలు వెలిగించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా హైదరాబాద్‌లోని తన నివాసంలో దీపం వెలిగించారు. ఆయనతోపాటు కుమారుడు లోకేష్, మనుమడు దేవాన్‌‡్ష దీపాలు వెలిగించి పట్టుకున్నారు. 

ప్రజల నుంచి విశేష స్పందన
కరోనా వైరస్‌పై పోరుకు సంఘీభావంగా దీప ప్రజ్వలన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా దీపాలు వెలిగించి తామంతా ఒక్కటేనని చాటి చెప్పారు. ఆదివారం రాత్రి సరిగ్గా 9 గంటలకు ప్రజలు తమ ఇళ్లల్లో కరెంటు లైట్లు ఆర్పి వేశారు. నూనె దీపాలు, కొవ్వొత్తులు వెలిగించారు. ‘దీప ప్రజ్వలన’ కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది.  

కరోనాపై పోరులో అందరం ఒక్కటిగా నిలుద్దాం
దీపాలు వెలిగించి మన ఐక్యతను చాటడం ద్వారా కరోనా మహమ్మారిపై పోరులో దేశమంతా ఒక్కటిగా నిలిచింది. ఇక ముందు కూడా ఈ పోరులో అందరం ఒక్కటిగా నిలుద్దాం. 
– ఆదివారం రాత్రి సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

30-05-2020
May 30, 2020, 04:57 IST
న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ 4.0 ముగిసిన తరువాత కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యల విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకే అధికారం ఇవ్వాలని...
30-05-2020
May 30, 2020, 04:53 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌–19ను ఎదుర్కొ నేందుకు అన్ని రకాలుగా సర్వసన్నద్ధంగా ఉన్నా మని, ఎవరూ భయపడవద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి...
30-05-2020
May 30, 2020, 04:26 IST
ప్రపంచ మార్కెట్లు పతన బాటలో ఉన్నా, కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నా శుక్రవారం మన మార్కెట్‌ ముందుకే దూసుకుపోయింది....
30-05-2020
May 30, 2020, 04:02 IST
న్యూఢిల్లీ: మౌలిక రంగానికి సంబంధించి ఎనిమిది పారిశ్రామిక విభాగాల గ్రూప్‌ ఏప్రిల్‌లో దారుణ ఫలితాన్ని చూసింది. ఈ గ్రూప్‌లోని పరిశ్రమల...
30-05-2020
May 30, 2020, 03:49 IST
న్యూఢిల్లీ: అందరి అంచనాలకు అనుగుణంగానే భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 2019 ఏప్రిల్‌ –2020 మార్చి ఆర్థిక సంవత్సరంలో...
30-05-2020
May 30, 2020, 02:00 IST
సోషల్‌ మీడియాలో శుక్రవారం సందడి చేశారు సమంత. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ లాక్‌డౌన్‌ సమయంలో సమంత...
29-05-2020
May 29, 2020, 22:33 IST
మరో ఐదుగురు వలస కార్మికులకు, విదేశాల నుంచి వచ్చిన వారిలో 64 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వెల్లడించారు. ...
29-05-2020
May 29, 2020, 21:24 IST
మహారాష్ట్రలోని తలోజా జైలులో ఉన్న విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు (80) శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు.
29-05-2020
May 29, 2020, 21:00 IST
ఆటోలు 1+2, కార్లు 1+3, మినీ వ్యాన్లు 50 శాతం ప్రయాణికులను చేరవేసేందుకు అనుమతి ఇస్తున్నాం. 
29-05-2020
May 29, 2020, 20:50 IST
సాక్షి, ప్రకాశం: అమెరికాలో నివసిస్తున్న తెలుగువారు ‘టామాటో ఛాలేంజ్’‌ పేరుతో జిల్లాలోని రైతులకు భరోసానిస్తున్నారు. అంతేగాక లాక్‌డౌన్‌లో తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్న‌ పేదవారికి...
29-05-2020
May 29, 2020, 20:00 IST
ముంబై వలస వెళ్లిన ఓ వ్యక్తి ఇంటికి తిరుగు పయనమయ్యే క్రమంలో..
29-05-2020
May 29, 2020, 18:56 IST
వెల్లింగ్ట‌న్‌‌: అనుకోకుండా ముంచుకొచ్చిన‌‌ క‌రోనా విప‌త్తు వ‌ల్ల ఇప్ప‌టికీ ఎన్నో దేశాలు అత‌లాకుత‌లం అవుతున్నాయి. నానాటికీ కేసుల సంఖ్య పెరుగుతూ డేంజ‌ర్...
29-05-2020
May 29, 2020, 17:02 IST
సాక్షి, న్యూఢిల్లీ : నేడు దేశాన్ని కరోనా వైరస్‌ కుదిపేస్తున్న నేపథ్యంలో వైరస్‌ల బారిన పడకుండా రక్షించుకునేందుకు వైద్య సిబ్బంది...
29-05-2020
May 29, 2020, 17:00 IST
పట్నా : రెండు రోజుల క్రితం బిహార్‌లోని ముజఫర్‌నగర్‌ రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌పై తల్లి మృతదేహాన్ని తట్టి లేపేందుకు ప్రయత్నించిన ఒక...
29-05-2020
May 29, 2020, 16:24 IST
సాక్షి, అమరావతి : దేశంలో కరోనా వైరస్‌ నియంత్రణకు కేంద్ర విధించిన నాలుగో విడత లాక్‌డౌన్‌ ఆదివారంతో ముగియనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌...
29-05-2020
May 29, 2020, 16:24 IST
కాలిఫోర్నియా: 'చికిత్స క‌న్నా నివార‌ణ మేలు' అనే మాట‌ క‌రోనాకు స‌రిగ్గా స‌రిపోతుంది. మందు లేని ఈ మాయ‌దారి రోగానికి మ‌నం...
29-05-2020
May 29, 2020, 15:50 IST
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 11638...
29-05-2020
May 29, 2020, 15:40 IST
ఛండీగ‌ర్ : దేశ‌వ్యాప్తంగా అత్య‌ధిక క‌రోనా కేసులు పెరుగుతున్న రాష్ర్టాల్లో ఢిల్లీ ఒక‌టి. అంతేకాకుండా డిల్లీ స‌రిహ‌ద్దుల‌కు ఆనుకొని ఉన్న...
29-05-2020
May 29, 2020, 15:39 IST
లండన్‌ : ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో చూసిన వైద్య సిబ్బంది తమ ప్రాణాలను ఫణంగా పెట్టి  కరోనా  పై నిరంతరం...
29-05-2020
May 29, 2020, 15:31 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ విస్తరిస్తున్న క్రమంలో అమెరికా ఔషధ సంస్థ ఫైజర్ కీలక అంశాన్ని ప్రకటించింది. 2020 అక్టోబర్ చివరి నాటికి...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top