వ్యాన్ - ట్రాక్టర్ ఢీ: ఒకరు మృతి | one person killed in tractor, van accident | Sakshi
Sakshi News home page

వ్యాన్ - ట్రాక్టర్ ఢీ: ఒకరు మృతి

Sep 15 2013 8:13 AM | Updated on Sep 1 2017 10:45 PM

కాగజ్నగర్ మండలం గురుజగూడ గ్రామ సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున వ్యాను, ట్రాక్టర్ ఢీ కొన్నాయి.

కాగజ్నగర్ మండలం గురుజగూడ గ్రామ సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున వ్యాను, ట్రాక్టర్ ఢీ కొన్నాయి. ఆ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిలో వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి 108కి సమాచారం అందించారు.

 

క్షతగాత్రులను ఆదిలాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకుని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement