శేషాచలం అడవుల్లో మరోసారి రెచ్చిపోయిన స్మగ్లర్లు

Once Again Smugglers Are safari In Seshachalam Hills - Sakshi

సాక్షి, చిత్తూరు : శేషాచలం అడవుల్లో మరోసారి తమిళ స్మగ్లర్లు రెచ్చిపోయారు. లాక్‌డౌన్ కారణంగా కొంతకాలం అడవుల్లోకి ప్రవేశించని స్మగ్లర్లు ఇప్పుడు మళ్లీ తమ వేట ప్రారంభించారు. రెండు రోజులుగా పెద్ద ఎత్తున శేషాచల అడవుల్లోకి వచ్చిన తమిళ స్మగ్లర్లు భారీ ఎత్తున ఎర్ర చందనం దుంగలు తరలించే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో తిరుపతి టాస్క్ పోర్స్ సిబ్బంది కుంబింగ్‌కు వెళ్ళింది. చంద్రగిరి మండలం భీమవరం ఘాట్‌లో  కుంబింగ్ పార్టీకి స్మగ్లర్లు తారస పడ్డారు. స్మగ్లర్లు మొదట పోలీసుల మీద రాళ్ళ దాడి చేశారు. పోలీసులు ప్రతి గతించడం తో స్మగ్లర్లు దుంగలు వదిలేసి పారిపోయారు. తమ వెంట ఉన్న బ్యాగ్‌లను వదిలేసి పోయారు. మొత్తం 33 దుంగలను స్వాదీనం చేసుకొన్నారు. దాదాపు రెండు కోట్ల రూపాయల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top