అనుమానాస్పదస్థితిలో వృద్ధురాలు మృతి చెందింది. ఈ సంఘటన గురువారం అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బోడాయిపల్లి గ్రామంలో వెలుగు చూసింది.
తాడిపత్రి (అనంతపురం జిల్లా) : అనుమానాస్పదస్థితిలో వృద్ధురాలు మృతి చెందింది. ఈ సంఘటన గురువారం అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బోడాయిపల్లి గ్రామంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బోడాయిపల్లి గ్రామానికి చెందిన శివరామమ్మ(77)కు ముగ్గురు కుమారులు. గ్రామ సమీపంలోని తోటలో ఉన్న ఇంటిలో ఆమె నివాసముంటుంది.
కాగా గురువారం తోట దగ్గరకు వెళ్లిన కొడుకు తల్లి మరణించడం చూసి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అయితే శివరామమ్మ గొంతుపై ఉన్న గుర్తుల ఆధారంగా గొంతు నులిమి హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదికలో పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.