బడి రుణం తీర్చుకున్నారు 

Old Students Constructed Of New Building For School - Sakshi

ప్రభుత్వ పాఠశాలను ఆదుకున్న పూర్వ విద్యార్థులు

రూ.25 లక్షల వ్యయంతో కొత్త భవనాల నిర్మాణం  

సాక్షి, కాశీబుగ్గ(శ్రీకాకుళం) : అక్షరాలు నేరి్పన చోటు శిథిలమవ్వకుండా వారు కాపాడారు. విద్యా బుద్ధులు నేరి్పన బడి నిర్జీవమవుతుంటే వచ్చి ఆదుకున్నారు. బతుకునిచ్చిన బడి చితికిపోతుంటే ముందుకు వచ్చి తమ కర్తవ్యాన్ని మర్చిపోకుండా అమలు చేశా రు. మొత్తానికి ఆ బడి రుణం తీర్చుకున్నారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని చినబడాంలో 1956లో ప్రభు త్వ పాఠశాల ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అనేక మంది విద్యార్థులు చదువులు పూర్తి చేసుకుని వివిధ హోదా ల్లో స్థిరపడ్డారు. చాలా మంది విదేశాల్లోనూ ఉన్నత స్థాయిలో ఉన్నారు. సంక్రాంతి, ఉగాది తదితర పండగలకు ఊరు వచ్చిన వారంతా శిథిలావస్థలో ఉన్న బడిని చూసి చలించిపోయేవారు. బడి దుస్థితిని చూసి తట్టుకోలేకపోయారు. 

దీంతో అంతా కలిసి బడిని బాగు చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఓ సమావేశం పెట్టుకుని ఎవరెవరు ఏమేం చేయాలో బాధ్యతలు పంచుకున్నారు. అంతే.. ఏకంగా రెండు అంతస్తుల్లో నా లుగు గదులు, రక్షణ గోడ, ముఖ ద్వా రం ఏర్పాటైపోయాయి. కొందరు స్థలం రాసివ్వగా, మరికొందరు పనికి సాయం చేశారు, ఇంకొందరు డబ్బులు పంపించారు. మొత్తానికి రూ.25లక్షల విలువైన భవనాలను అవలీలగా కట్టేశారు.  
నేడు భవనాలు ప్రారంభం చినబడాం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో దాతలు నిర్మించిన భవనాలను పలాస ఎమ్మెల్యే డాక్టర్‌ సీదిరి అప్పలరాజు గురువారం ప్రారంభించనున్నారు. ప్రధానోపాధ్యాయుడు కె.శ్రీనివాసరావు, ఇతర ఉపా«ధ్యాయులు ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. 

దాతలు ముందుకు రావడం సంతోషం  
ప్రభుత్వ పాఠశాలలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు. అందుకు ఇలాంటి దాతలు తో డైతే పాఠశాలలు బంగారంలా తయారవుతాయి. పూర్వ విద్యార్థులు, పెద్దలు ముందుకు వచ్చి వితరణ చేశారు. రూ.25 లక్షలు ఖర్చు చేశారు. విదేశాల్లో ఉన్నవారితో పాటు, వైద్య వృత్తిలో స్థిరపడినవారు సాయం అందించారు. 
– కె.శ్రీనివాసరావు, హెచ్‌ఎం, ప్రభుత్వ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, చినబడాం 


 దాతలు నిర్మించిన ముఖ ద్వారం, ప్రహరీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top