నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కాకినాడ ఏటిమొగ్గలో ఉద్రిక్తత నెలకొంది.
కాకినాడ : నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కాకినాడ ఏటిమొగ్గలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. 14వ డివిజన్ టీడీపీ అభ్యర్ధి వనమాడి ఉమాశంకర్ పోలింగ్ కేంద్రాలలో ప్రచారం చేస్తుండగా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి రెండు వర్గాలను చెదరగొట్టారు. కాగా ఇప్పటివరకూ 12 శాతం పోలింగ్ నమోదు అయింది. మరోవైపు ఎన్నికల ఈవీఎంలపై నోటా ఆప్షన్ కనబడలేదు.
మరోవైపు పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన అనధికార వ్యక్తులు, ఓటు లేని వారు సైతం పోలింగ్ బూత్ లోపలికి వెళ్లడం వివాదాస్పదమౌతుంది. వారిని పోలీసులు అదుపు చేయలేకపోవడంపై ప్రతిపక్ష నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.