తెలుగుదేశం పార్టీలో ఇతర పార్టీల నాయకులు చేరితే బీజేపీ నేతలకు చెప్పాల్సిన అవసరం లేదని టీడీపీ అర్బన్ ...
ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న
విజయవాడ (వన్‌టౌన్) : తెలుగుదేశం పార్టీలో ఇతర పార్టీల నాయకులు చేరితే బీజేపీ నేతలకు చెప్పాల్సిన అవసరం లేదని టీడీపీ అర్బన్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ కార్యాలయంలో ఆయనతో కలిసి వెంకన్న గురువారం విలేకరులతో మాట్లాడారు. జలీల్‌ఖాన్ బలమైన నాయకుడని, అందుకే పార్టీలో చేర్చుకున్నామని పేర్కొన్నారు.
అతనిపై వైఎస్సార్ సీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. జలీల్‌ఖాన్ మాట్లాడుతూ గడిచిన రెండు సంవత్సరాల్లో ప్రతిపక్ష నేతగా ప్రజలకు ఏమీ చేయలేకపోయానని అన్నారు. ఇప్పుడు అధికార పార్టీ నాయకుడిగా పనులు చేయించుకుంటానని పేర్కొన్నారు.