దర్శకుడు రాజమౌళి తండ్రికి నాన్ బెయిలబుల్ వారెంట్ | Non bailable warrants for SS Rajamouli father Vijayendra Prasad in checkbounce case | Sakshi
Sakshi News home page

దర్శకుడు రాజమౌళి తండ్రికి నాన్ బెయిలబుల్ వారెంట్

May 30 2014 5:11 PM | Updated on Sep 2 2017 8:05 AM

దర్శకుడు రాజమౌళి తండ్రికి నాన్ బెయిలబుల్ వారెంట్

దర్శకుడు రాజమౌళి తండ్రికి నాన్ బెయిలబుల్ వారెంట్

దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు యలమంచిలి కోర్టులో చుక్కెదురైంది.

విశాఖపట్నం: దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు యలమంచిలి కోర్టులో చుక్కెదురైంది. చెక్ బౌన్స్ కేసులో విజయేంద్ర ప్రసాద్ కు యలమంచిలి కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. 
 
జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'నరసింహుడు' సినిమా కోసం నిర్మాత చెంగల వెంకట్రావ్‌ వద్ద 30 లక్షల రూపాయలు తీసుకున్నారు. అయితే ఆ సినిమా విషయంలో వెంకట్రావ్, విజయేంద్ర ప్రసాద్ కు విభేదాలు తలెత్తడంతో ఇచ్చిన పారితోషికాన్ని తిరిగి ఇవ్వాలని కోరారు.
 
అయితే బకాయి పడ్డ డబ్బు చెల్లింపు కోసం ఇచ్చిన చెక్‌ బౌన్స్‌ కావడంతో యలమంచిలి కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసులో తాజాగా విజయేంద్ర ప్రసాద్ కు కోర్టు  వారంట్ జారీ చేసింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement