కొత్త పార్టీ ఏర్పాటుకు సమయం లేదు: లగడపాటి | No time for a new party, says Lagadapati Rajagopal | Sakshi
Sakshi News home page

కొత్త పార్టీ ఏర్పాటుకు సమయం లేదు: లగడపాటి

Feb 1 2014 2:58 PM | Updated on Sep 27 2018 5:59 PM

కొత్త పార్టీ ఏర్పాటుకు సమయం లేదు: లగడపాటి - Sakshi

కొత్త పార్టీ ఏర్పాటుకు సమయం లేదు: లగడపాటి

సమైక్యాంధ్రకు మద్దతుగా త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటామని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటామని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. శనివారం రాజమండ్రి వచ్చిన రాజగోపాల్ మీడియాతో మాట్లాడారు. సాధారణ ఎన్నికలు దూసుకువస్తున్న తరుణంలో కొత్త పార్టీలు వచ్చేందుకు సమయం లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పార్టీలతోనే రాష్ట్ర విభజనను అడ్డుకుంటామన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 9న సీమాంధ్ర ప్రధాన పట్టణాలలో నిర్వహించనున్న 2కే రన్ విజయవంతం చేయాలని సీమాంధ్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.



రాష్ట్ర విభజన దృష్ట్యా సీమాంధ్రలో కొత్త పార్టీ ఆవిర్భవిస్తుందని ఇటీవల ఊహగానాలు ఊపందుకున్నాయి. అదికాక టి.బిల్లు తప్పుల తడక అని ఈ నేపథ్యంలో ఆ బిల్లును తిప్పి రాష్ట్రపతికి పంపాలని కిరణ్ కుమారు రెడ్డి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్కు నోటీసులు ఇచ్చారు. దాంతో టి.బిల్లును రాష్ట్రపతికి పంపుతూ అసెంబ్లీ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.  దాంతో విలేకర్లు రాజగోపాల్ను ప్రశ్నించినప్పుడు ఆయనపై విధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement